పవన్ ఫ్యాన్స్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ .. మార్చి 19న బాక్సాఫీసు ను తెరవబోతోంది… హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి.. ఓజీతో సునామీ క్రియేట్ చేసి 300 కోట్ల క్లబ్ లో చేరిన పవన్ రేంజ్… ఈ సినిమాలో ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ అభిమానుల్లో ఉంది…
సినిమాపై భారీ అంచనాలు
ఎందుకంటే సినిమా ప్రారంభం తర్వాత రాజకీయాల్లో పవన్ బిజీ అయిపోవడం.. సినిమా వాయిదా పడటం.. మళ్లీ స్టార్ట్ అవ్వడం ఇలా అభిమానుల్లో బొమ్మ ఎలా ఉంటుందో అని అనుమానాలు… కానీ పేపర్లు చింపేయండి… బెలూన్లు ఎగరేయండి.. పవర్ స్టార్ సినిమా పవర్ ఫుల్ గా ఉందనేది సెన్సార్ టాక్…
సెన్సార్ టాక్ ఎలా ఉంది?
మొత్తం నిడివి 2 గంటల 33 నిమిషాలు.. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు మూడు సీన్లు థియేటర్లు దద్దరిల్లేలా ఉన్నాయట… కథనం.. పవన్ ఎలివేషన్… ప్రస్తుత సామాజిక అంశాలుతో పాటు ప్రత్యేకేంగా పవన్ డ్యాన్స్ అభిమానులకే పండగే అంటున్నారు…
300 కోట్ల క్లబ్‌పై చర్చ
ఓజీతో 300 కోట్ల క్లబ్ లో చేరిన పవన్ .. ఈ సినిమాతోనూ అదే రేంజ్ ప్రదర్శించోచనేది ఇండస్ట్రీ టాక్… పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయండి… మీకే… చెబుతోంది..

