దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టు .. ఏం జరగలేదంటూ తీర్పు ఇవ్వడం … కేజ్రీవాల్ కన్నీళ్లు పెట్టేసి నేనేం తప్పు చేయలేదని చెప్పడం… కవిత నేను నిరపరాధిని … ఇది రాజకీయ ప్రేరేపితం అని వ్యాఖ్యానించడం .. ఇంకా అంతా అయిపోయింది.. ఇది బిజెపి పొలిటికల్ గేమ్ అంటూ విశ్లేషణలు .. ఇది ఇప్పటి వరకు జరిగింది…
ఢిల్లీ హైకోర్టుకు సీబీఐ అప్పీల్
రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పుపై సీబీఐ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది.. మళ్లీ కొంత సీన్ మారింది… కేజ్రీవాల్ తో పాటు కవిత మిగతావారికి నోటీసులు వచ్చాయి… దర్యాప్తు అధికారిపై దర్యాప్తు చేయాలన్న రౌజ్ అవెన్యూ కోర్టుపై కూడా ఢిల్లీ హైకోర్టు అభ్యంతరం చెప్పింది.. దీంతో మళ్లీ బంతి సీబీఐ కోర్టులోకి వచ్చింది…
మళ్లీ మొదటికే వ్యవహారం
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అంతా అయిపోయింది… కేజ్రీవాల్ నిర్ధోషి ఇలాంటవన్ని వారం రోజులకే పరిమితమైన వార్తలుగా హెడ్ లైన్స్ గా మిగిలిపోయాయి.. అంతా అయిపోలేదు… మళ్లీ మొదటికే… కేజ్రీవాల్ మిగతావారు మళ్లీ జైలుకు పోవచ్చు… బిజెపి మళ్లీ కాలర్ ఎగరేయోచ్చు… చెప్పాను కదా.. అంతా అయిపోలేదు…

