Sanju Samson

కాబోయే టీ20 కెప్టెన్ సంజూ శాంసన్ ! వన్డే జట్టులోనూ ఛాన్స్?

Spread the love

యస్ మీరు వింటుంది నిజమే… టీ 20 వరల్డ్ కప్ లో ఇరగదీసిన సంజూ శాంసన్ కు టీ20 జట్టు పగ్గాలు అప్పగించబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది..

మొన్నటి వరల్డ్ కప్ విజయం తర్వాత ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రిటైర్ మెంట్ ప్రకటిస్తారనే వార్త చక్కర్లు కొట్టింది.. కెప్టెన్ గా సక్సెస్ అయినా.. బ్యాటర్ గా సూర్యకుమార్ ఫెయిలవుతూ వస్తున్నాడు.

35 ఏళ్ల సూర్యకుమార్ టీ20 లకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా వన్డేలపై దృష్టి పెట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం… అయితే ఫాం కొనసాగించడం కీలకం.. అది లేకపోతే ఏ ఫార్మట్ కైనా లెక్క చేయరు..

ఇప్పుడు నా వాడు, మన వాడు అనుకునే పరిస్థితి లేదు.. క్రిక్రెట్ వరల్డ్ లో కాంపిటీషన్, ఫెర్మాఫర్మెన్స్ ఆ స్థాయిలో ఉంటున్నాయి.. వైస్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఉన్నప్పటికీ ఆయన రెగ్యులర్ బౌలర్ కాదు… టీ 20 వరల్డ్ కప్ లోనే అన్ని మ్యాచ్ లు ఆడలేదు…

సంజు శాంసన్ కోసం మాట్లాడాల్సి వస్తే.. వరల్డ్ కప్ లో కొన్ని మ్యాచ్ లకు ఆయనకు ఛాన్స్ దక్కలేదు.. అన్యూహాంగా సూపర్ 8, సెమీ ఫైనల్ , ఫైనల్లో తన సత్తా చాటి టీం ఇండియా కప్ గెలిచేందుకు బాటలు వేశాడు..

సీనియర్ కావడం తో పాటు ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా పనిచేసిన అనుభవం, నిబద్దత ఖచ్చితంగా ప్లస్ పాయింట్స్ కావోచ్చంటున్నారు.. త్వరలో టీ 20 కెప్టెన్ గా సంజూ శాంసన్ ప్రకటన ఉండోచ్చనే టాక్ వస్తోంది…

వచ్చే సంవత్సరం జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రధాన బౌలర్ బుమ్రా కు టీ 20ల్లో రెస్ట్ ఇచ్చి… వచ్చే వరల్డ్ కప్ నాటికి రెడీ చేసేందుకు సిద్దమవుతోంది..

అలాగే సూర్యకుమార్ యాదవ్ ను కూడా పూర్తిగా వన్డే ఫార్మాట్ పై దృష్టి పెట్టేలా బీసీసీఐ ఆలోచన చేస్తుందట.. వచ్చే సంవత్సరం అక్టోబర్ – నవంబర్ లో వన్డే ప్రపంచ కప్ జరగబోతోంది.. ఆలోపు భారత్ వివిధ జట్లలో 35 వన్డేలు ఆడబోతోంది.. దీనికి బుమ్రా, కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి కీలక ఆటగాళ్లకు సంసిద్దం చేసే ప్లాన్ లో బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది…

ఈ నేపథ్యంలో టీ20 కి కెప్టెన్ గా సంజూ శాంసన్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది… మాజీ క్రికెటర్ కైఫ్ కూడా సంజూ అన్ని రకాలుగా అర్హుడంటూ ప్రకటన కూడా చేశాడు.. నిలకడతో ఆట తీరు కనబరిస్తే వన్డే జట్టులోనూ సంజూ శాంసన్ కు కీలక స్థానం ఇచ్చి ఎంకరేజ్ చేసేందుకు బీసీసీఐ ఆలోచిస్తోంది.. సంజూ బెస్ట్ ఆఫ్ లక్..

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *