దొంగ ఎవరో పట్టుకోగలరా మంత్రి కిషన్ రెడ్డి గారు..?
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎంపీలకు క్లాస్ పీకారనే వార్త చూశాం… పార్టీ ని పట్టించుకోవడం లేదు… సోషల్ మీడియాలో
అసదుద్దీన్ లా యాక్టివ్ గా లేరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు అసంతృప్తి కలిగించాయి… మీకంటే కేరళ, తమిళనాడు బెటర్ అంటూ మోదీ ఎంపీలపై అసంతృప్తి వ్యక్తం చేశారంటూ వచ్చింది… అయితే వార్త వచ్చిన మూడు రోజుల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.. లోపట జరిగిన సమాచారం బయటకు ఎలా వచ్చింది… లీకు వీరులు ఎవరైనా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు… కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండమన్నారు. పార్టీ బలోపేతంపై సలహాలిచ్చారు… నేతలు ఎలా ఉండాలో చెప్పారంటూ అదే కిషన్ రెడ్డి సెలవిచ్చారు.. మంత్రి గారు మీరు చెప్పిందే కదా ప్రధాని చెప్పారని వార్తలోచ్చాయి… మీరన్నట్లు ప్రధాని మోదీ అంత సుతి మెత్తగా చెప్పారా.. రెండోది ఇక్కడ మాట్లాడుకున్నది బయటకు చెప్పోద్దని కూడా మోడీ చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు.. మరి లీక్ వీరులెవరో కనిపెట్టండి… వాళ్లు కూడా మీ లాగే ఎంపీలు.. చిన్న పిల్లలు కాదు.. ఖచ్చితంగా ఇలాంటి సమావేశం జరిగినప్పుడు మీడియా సమాచార సేకరణ చేయకుండా ఎందుకు ఊరుకుంటుంది… చేసింది… ఏపీలో ఎంపీలకు కూడా ఏం చెప్పారో కూడా వచ్చింది.. అయినా ప్రధాని మోదీ చెప్పిందాంట్లో ఏం తప్పుంది.. పవర్ బూస్టర్ గా తెలంగాణలో నిలబడాల్సిన పరిస్థితి నుంచి ఎందుకు పార్టీని మళ్లీ గాడి తప్పించేశారనేది మీ పార్టీలోనూ చర్చ ఉంది కదా.. బిజెపి బీఆర్ఎస్ ఒక్కటే అన్న వాదనను కూడా బలంగా తిప్పికొట్టలేకపోతున్నారు కదా… పార్టీ లో వర్గ పోరు… సగటు బిజెపి కార్యకర్త ఆశలు ఆకాంక్షలకు విఘాతం కల్గిస్తున్న మాట వాస్తవం కాదా.. తప్పు మీ అందరిది సగం అయితే.. ఇంత జరుగుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకపోవడంలో అధిష్టానం అలసత్వ వైఖరి కూడా ఓ కారణమే… మరి ఆ లీకు వీరుడు ఎవరో.. తెలిస్తే చర్య తీసుకుంటారో లేదో… ?

Posted inUncategorized
