ట్రెండ్ మారుస్తున్న ఛానళ్లు.. కొన్నింటిలో అదే పిచ్చి ధోరణి

ట్రెండ్ మారుస్తున్న ఛానళ్లు.. కొన్నింటిలో అదే పిచ్చి ధోరణి

తెలుగు మీడియా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది… ముఖ్యంగా ఛానల్స్ కు ఫేస్ ఆఫ్ ద ఛానల్ గా ఉన్నవాళ్లు, డిబేట్ యాంకర్స్ రూట్ మారుస్తున్నారు… పబ్లిక్ ఒపినీయన్ కు తగ్గట్లుగా డిబేట్స్ , ఇంటర్వ్యూస్ చేస్తున్నారు.. జాతీయ మీడియా ఛానల్స్ లో అయితే ప్రైమ్ టైం యాంకర్స్ గానీ… చీఫ్ ఎడిటర్ స్థాయి వాళ్లు కూడా ట్రెడింగ్ సినిమాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, పబ్లిక్ ఇష్యూస్ పై ఇంటర్వ్యూలు చేస్తుంటారు.. కానీ రీజనల్ మీడియాలో మెయిన్ యాంకర్స్ ఎక్కువుగా పొలిటికల్ డిబేట్లకే ప్రాధాన్యమిస్తారు.. అయితే సోషల్ మీడియా విసృతి పెరిగిన తర్వాత ఛానల్స్ లో వస్తున్న పొలిటికల్ డిబేట్స్ కు అంత ప్రాచుర్యం లభించడం లేదు… డిబేట్లకు వస్తున్న గెస్టులు కూడా రిపీట్ అవుతుండటం.. చెప్పే విషయంలో కొత్తదనం లేకపోవడం, వ్యక్తిగత దూషణలు చేస్తే ట్రెండ్ అవుతామనే ధోరణి వెరసి డిబేట్లంటే ప్రేక్షకులకి వెగటు పుడుతోంది… ఈ విషయంలో టీవీ5 మూర్తి, 10 టీవీ సతీష్ ల కోసం వేరేగా చెప్పాలి.. పొలిటికల్ డిబేట్లతో పాటు పబ్లిక్ ఇష్యూస్ పై వీరిద్దరూ డిబేట్లు చేస్తుంటారు… అలాగే తాజాగా అనిల్ రావిపూడి, నవీన్ పొలిశెట్టిని మూర్తి ఇంటర్వ్యూ చేస్తే… సతీష్ వీకెండ్ పాడ్ కాస్ట్ పేరుతో అనిల్ రావిపూడి, బన్నీవాసు, అనిల్ సుంకర, హేమ, ప్రగతి, సుమన్ ఇంటర్వ్యూలు చేశారు.. వీరిద్దరూ పొలిటికల్ కే పరిమితం కాకుండా చేస్తున్న ప్రయోగాలు, ఇంటర్వ్యూలు ప్రాచుర్యం పొందుతున్నాయి.. ఆపరేషన్ సింధూర్ నుంచి నిన్నటి అనసూయ- శివాజీ వివాదం వరకు నాన్ పొలిటికల్ అంశాలపై వీరిద్దరూ డిబేట్లు చేశారు.. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో టీవీ5, 10టీవీల్లో ఈ ధోరణి కనిపిస్తోంది… ఇక సాక్షి, ఏబీఎన్, వీ6 ల్లో ఏదో ఒక పొలిటికల్ అంశంపై డిబేట్ పెడుతుండటంతో జనాల్లో ఆసక్తి తగ్గిపోతోంది… ఇక టీవీ 99, ఆర్ టీవీ, బిగ్ టీవీల్లో చర్చలు సోషల్ మీడియాలో వ్యూస్ కోసమే అన్నట్లు నాసిరకం హెడ్డింగ్ లు, ఒకరు పై ఒకరు బూతులు, వ్యక్తిగత దూషణలు తిట్టుకునేలా యాంకర్లు ప్రోత్సహించడం లాంటి జుగ్సుపాకర వాతావారణం కనిపిస్తోంది. ఈ విషయంలో బిగ్ టీవీ కొంత బెటర్.. కానీ ఈ మధ్యన అనసూయ- శివాజీ వివాదంలో యాంకర్ల ఓవరాక్షన్ ఆ ఛానల్ కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఇక టీవీ 9, ఎన్ టీవీలు డిబేట్లు చేయడం మానేశాయి.. ఎన్ టీవీ సోషల్ మీడియా మాత్రం పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలకు ప్రాధాన్యత ఇస్తోంది.. అవి జనాల్లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి…

Comments

No comments yet. Why don’t you start the discussion?

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *