మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ లొంగిపోలేదా.. పోలీసులు అరెస్ట్ చేశారా… లొంగిపోయారు అని పోలీసులు అబద్దం చెప్పారా… లొంగిపోయామంటే బాగుండదు కాబట్టి అరెస్ట్ అయ్యామని దేవ్ జీ అబద్దం చెప్పారా… తాజాగా మావోయిస్టు పార్టీ చీఫ్ గా వ్యవహరించి దేవ్ జీ మేం లొంగిపోలేదంటూ చేసిన ప్రకటన విస్మయానికి గురిచేసింది…
మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ్ జీ చాలా విషయాలు దాచి పెట్టి మాట్లాడినట్టు కనిపించింది. శరణు కొరలేదు అని.. వేరే చోటకు వెళ్తుండగా అరెస్ట్ చేశారని అన్నారు… అలాగే చనిపోయినవారికి మాది బాధ్యత ఎలా అవుతుందంటూ ప్రశ్నించడం గానీ… సోనూ, సతీష్ లాగా మేం చేయలేదంటూ చెప్పడం గానీ.. చూస్తే… దేవ్ జీ కొంత యూటర్న్ తీసుకున్నారా అన్నట్లు గా కనిపిస్తోంది..
అరెస్ట్ అయ్యి ఉంటే… పరిస్థితుల బట్టే వచ్చాం.. ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పడం కొంత తేడాగా కనిపిస్తోంది.. మావోయిస్టు పార్టీ ని లీగలైజ్ చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అప్పీల్ చేశామని… దాని బట్టి రాజకీయ పార్టీగా ఉండడమా.. ప్రత్యక్ష రాజకీయాల్లో రావడమా లేదా అనేది నిర్ణయిస్తామని చెప్పారు.. అలాగే ప్రభుత్వం ఇబ్బందికి గురిచేస్తే మళ్లీ అడవి బాట పడతానని దేవ్ జీ అన్నారు.. అరెస్ట్ చేసి సరెండర్ చూపించారని మరో మావోయిస్టు అగ్రనేత రాజి రెడ్డి అనడం కొంత సెన్సేషనే.. చూద్దాం పోలీసుల స్పందన ఎలా ఉంటుందో ?
