మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ .. ప్రవచన కర్త అవతారం ఎత్తారు.. ఎప్పుడూ రాజకీయ పరమైన అంశాలు, రాష్ట్ర విభజనకు సంబంధించిన విషయాలపై మాట్లాడే ఉండవల్లి అరుణ్ కుమార్ సడన్ గా భగవద్గీత సారంపై వ్యాసాలు రాస్తుండటంపై హాట్ టాపిక్ అయ్యింది.. స్వతహా మంచి మాటకారి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ … లో ఆధ్యాత్మిక వేత్త కూడా ఉన్నాడా అని ఆశ్చర్య పోతున్నారు.. తాజాగా ప్రముఖ దినపత్రికల్లో ఉండవల్లి రాసిన భక్తి వ్యాసాలు ప్రచురితమవుతున్నాయి..
ఉండవల్లి పూర్తిగా భక్తి మార్గం పట్టేశారా… ఇక పాలిటిక్స్ జోలికి రారా… అనేది చూడాలి… త్వరలో చాగంటి కోటేశ్వర్రావు, గరికపాటి నరసింహారావులా ప్రవచనాలు చెప్పే ఆలోచన కూడా ఉండవల్లి కి ఉందని ఆయన అనుచరులు అంటున్నారు… ఇప్పటికే రాష్ట్ర విభజన అస్పష్టంగా జరిగిదంటూ న్యాయపోరాటం చేస్తున్న ఉండవల్లి.. ఏపీ పాలిటిక్స్ పై అడపాదడపా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు… సోషల్ మీడియాలో బాంబులు పేల్చూతూనే ఉన్నారు… మరి భక్తి మార్గంలో వెళ్తారా… మంచి ప్రవచనకర్తగా పేరు తెచ్చుకుంటారా… ఇక నుంచి ఉండవల్లిని బ్రహ్మాశ్రీ ఉండవల్లి అరుణ్ కుమార్, గురూజీ, స్వామీజీ అని పిలవాలా .. చూద్దాం.. ఏదేమైనా ఆయనలో కలిగిన ఈ మార్పు అభినందనీయమే… సమాజానికి మేలు చేసే ఈ రచనలు మంచివే కదా.. ఆల్ ది బెస్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్

