మెస్సీతో మ్యాచ్ – పెరిగిన రేవంత్ గ్రాఫ్ .. ఇండియాలో ట్రెడింగ్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి … ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీతో మ్యాచ్ ఆడటం ట్రెడింగ్ అయిపోయింది.. తెలంగాణ సీఎంగా, కాంగ్రెస్ నేతగా రేవంత్ రెడ్డి అందరికి తెలుసు.. దేశ వ్యాప్తంగా కొందరికి తెలిసుండోచ్చు.. కానీ ఈ మ్యాచ్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రపంచానికి మొత్తం తెలిసిపోయారు.. ఒక సీఎం మెస్సీతో మ్యాచ్ అనే సరికి నెట్ జన్లు ఎప్పుడూ లేని ఆసక్తి కనబరిచారు… దీంతో గత వారం రోజులు సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ మెస్సీ యాష్ టాగ్స్ విపరీతంగా ట్రెడింగ్ అయ్యాయి…
అలాగే పిల్లలకూ కూడా రేవంత్ రెడ్డి రీచ్ అయ్యారు.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ కు టాప్ ఇమేజ్ ఉంది.. పిల్లలు నుంచి పెద్దల వరకు కేసీఆర్ తెలుసు.. రేవంత్ రెడ్డి కూడా సీఎంగా కాంగ్రెస్ నేతగా రెండు రాష్ట్రాల్లో ఇమేజ్ ఉంది.. కానీ మెస్సీ మ్యాచ్ తో స్కూల్ పిల్లల వరకు సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో మ్యాచ్ అంటా అంటూ చర్చించుకోవడం.. యూ ట్యూబ్, ఇన్ స్టాలో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు… దీంతో పిల్లల వరకు సీఎం రేవంత్ రీచ్ పెరిగింది… రీచ్ , ఇమేజ్ పెంచుకోవడం ఎప్పటికైనా ప్లస్సే… ఒక రకంగా మెస్సీతో మ్యాచ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడమే కాదు.. సీఎం రేవంత్ ఇమేజ్ తో పాటు రీచ్ ను పెంచింది..

Posted inTelangana
