గతంలో గరుడ పురాణం… ఆపరేషన్ గరుడ అంటూ హడావుడి చేసిన నటుడు శివాజీ… ఇప్పుడు తన సినిమా ఆడకపోయే సరికి ఇది జగన్ కుట్ర.. మోడీ అమిత్ షాకే చెబుతా… అంటూ హంగామా చేస్తున్నాడు.. శివాజీ నటుడే కావోచ్చు.. గతేడాదిలో వచ్చిన సినిమాల్లో మంచి పాత్రలే చేసి ఉండోచ్చు.. కానీ నువ్వు తీసిన సినిమా ప్రేక్షకులకు నచ్చాలని రూల్ ఏమైనా ఉందా… ఎవరో టాక్ పెట్టేస్తే నెగటివ్ ప్రచారం చేసేస్తే సినిమా ఫ్లాప్ అయిపోద్దా.. వీటినే సినిమా కబుర్లు అంటారు… సినిమాలో సంగతి ఉంటే ప్రజలే నెత్తిన పెట్టుకుంటారు.. ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాలు అలాగే సూపర్ హిట్టయ్యాయి…
కానీ నీ సినిమాని ఎవరో చెప్పారని థియేటర్లలో విడుదల చేసి ఇప్పుడేమో … ఆడకపోయేసరికి వైసీపీ కుట్ర, జగన్ కుట్ర అంటూ మాట్లాడుతున్నావ్… అవును మాజీ సీఎం జగన్ కు ఏం పని లేదు… ప్రతి రోజూ శివాజీయే రేపు నాకు ఎన్నికల్లో ప్రత్యర్థి… అతని వల్ల మన పార్టీకి ప్రమాదం అని భయపడుతున్నాడు.. అంతేగా నీ మాటల అర్థం…
రాజకీయ ఆరోపణలపై చర్చ
ఏంటీ బిజెపి పెద్దలతో .. ప్రధానితోనే మాట్లాడతావా… మనకి మనం ఎక్కువ ఊహించికోవడమంటే ఇదే. ప్రతి ఒక్కరూ జగన్ కు జై కొట్టాలని లేదు.. అది పూర్తిగా నీ స్వేచ్చ… కానీ నీ సినిమా ఆడకపోయేసరికి రాజకీయంగా హైలెట్ అయిపోదామని.. ఏదో టీడీపీని మోసేస్తున్నట్లు ప్రవర్తించకు…
సోషల్ మీడియాలో స్పందన
నీ వ్యాఖ్యల పై టీడీపీ సోషల్ మీడియా కూడా గమ్మునుంది… అది మీ రేంజ్ ….. కొంచమైనా ఉండాలి కదా…

