పవన్ గెలిచాడు… రఘురామ ఓడాడు.. జయసూర్య బదిలీ
కూటమి ప్రభుత్వంలో ఓ డీఎస్పీ వ్యవహారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య రచ్చకు దారి తీసింది.. ప్రజా దర్బార్ లో భాగంగా భీమవరం డిఎస్పీ జయసూర్య సివిల్ వ్యవహారాల్లో తలదూర్చుతున్నాడని, విధి నిర్వహణలో అతిగా వ్యవహరిస్తున్నాడని పవన్ కల్యాణ్ కు భీమవరానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు.. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని మరి కొందరు ఫిర్యాదు చేశారు.. వెంటనే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఇదే విషయమై ఫోన్ చేసి… విచారణ చేపట్టాలని ఆదేశించారు.. విషయం తెలిసిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు … జయ సూర్య మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారి అని.. లా అండ్ ఆర్డర్ ను కాపాడేందుకే అలా వ్యవహరిస్తున్నారని సర్టిఫికేట్ ఇచ్చారు.. అంతటితో ఆగకుండా మరుసటి రోజు మీడియా సమావేశం పెట్టి భీమవరం డిఎస్పీ గా జయసూర్యే ఉంటాడు.. నేను చెబుతున్నాను కదా అని అన్నారు.. దీంతో సోషల్ మీడియాలో పవన్ పై ఒకటే ట్రోలింగ్ మొదలైంది.. చివరికి డిప్యూటీ స్పీకర్ రఘు రామకు కూడా పవన్ అలుసైపోయారు.. కూటమిలో పవన్ పరిస్థితి ఇంత దయనీమయా అంటూ రచ్చ మొదలైంది… అయితే ఇప్పుడు పవన్ మాటే నెగ్గింది… డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ డిజీపీ హరీష్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు… ఆయన స్థానంలో రఘువీర్ విష్ణును డిఎస్పీగా నియమించారు.. కూటమిలో పవన్ మాటకు విలువ ఉందని నిరూపితమైందని జనసేన సంబరపడుతోంది.. అయితే ఈ ఎపిసోడ్ లో రాజు గారి పై పవన్ పై చేయి సాధించినట్టే… మరి రఘురామ ఎలా స్పందిస్తారో చూడాలి… ఏదేమైనా రాజు గారు ఓడారు… పవన్ గెలిచాడు… అయితే ఫైనల్ గా ప్రజాస్వామ్యం గెలిచింది…

Posted inAndhra Pradesh ap politics pawankalyan
