వీరసింహారెడ్డి డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్యతో NBK 111 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. మరో నెల రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది… అఖండ 2 హిట్ తో మంచి జోష్ మీదున్న బాలయ్య… ఆ జోష్ చల్లారకముందే మరో చిత్రం షూటింగ్ కూడా స్టార్ చేసేస్తున్నారు… ఇక, సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే… దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంతార చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేసిన అరవింద్ కశ్యప్‌ను ఈ సినిమాకు తీసుకోవడం ఇప్పుడు బాలయ్య అభిమానులకు క్రేజీ న్యూస్… ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతుండటంతో మంచి లోకేషన్ల కోసం కెమెరామెన్ అరవింద్ కశ్యప్ ఇప్పటికే పని మొదలుపెట్టారట… సెట్స్ వేయడమే కాకుండా… అద్బుతమైన లోకేషన్ల కోసం .. పశ్చిమ దేశాల టూర్ కు కూడా కశ్యప్ బయలుదేరి వెళ్లారట… నిర్మాణ విలువుల పరంగా… బడ్జెట్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా తీసేందుకు నిర్మాత కిలారు సతీష్ సన్నద్దమవ్వడంతో ఈ పాన్ ఇండియా సినిమాతో బాలయ్య ను వెయ్యి కోట్ల క్లబ్ లో చేర్చేంత స్థాయి సబ్జెక్ట్ అని చర్చ జరుగుతోంది.. బాలయ్య అభిమానులు ఈ క్రేజీన్యూస్ తో ఇక ఊగిపోండి… బాలయ్య కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు గోపీచంద్ మలినేని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు.

Posted inbalakrishna Cinema
