పార్లమెంట్ సమావేశాల సందర్బంగా తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్ తీసుకున్నారు.. పార్టీ పరిస్థితి బాగాలేదంటూ ఫైర్ అయ్యారు.. ఇన్నాళ్లుకు తెలిసిందా తెలంగాణలో బిజెపి పరిస్థితి కోసం… దక్షిణాదిలో కర్నాటక కంటే ఎక్కువ బిజెపి అభిమానులు, ఆర్ఎస్ఎస్ సిద్దాంత ప్రేమికులు ఎక్కువుగా ఉన్నది తెలంగాణలోనే… కానీ ఎందుకో ఆ పార్టీ నాయకత్వం సమస్య పార్టీని ఎప్పూడూ … నీకు విజయం ఎప్పుడూ అంటూ పలకరిస్తూనే ఉంటుంది… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1999 ఎన్నికల్లో ఎప్పుడూ చూడని అద్భుత విజయాలను చూసిన బిజెపి ఆ తర్వాత సూపర్ ఫలితాలు సాధించిన దాఖలాలు కనిపించలేదు.. అయితే 2023 ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే సీట్లు.. 2024 లోక్ సభ ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నాక.. బిజెపి తెలంగాణలో కొంత సర్దుకొంది అన్న భావన కలిగింది.. కానీ మళ్లీ కాడెను పక్కన పడేశారు నేతలు…
గట్టిగా అనుకుంటే కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే స్థాయికి బిజెపిని పట్టాలపైకి తేవోచ్చు.. కానీ ప్రయత్నం చేసేదెవరు అనేదే ప్రశ్న… ఇక్కడ నేతలకు బిజెపి గ్రాఫ్ ను పెంచడం కంటే తమ వ్యక్తిగత గ్రాఫ్ ను పెంచుకోవడమే ప్రధాన ఎెజెండా… పట్టుమని ఉన్న 8 ఎంపీలు మూడు గ్రూపులట… అందులోనూ కిషన్ రెడ్డి వర్గం వేరు… బండి సంజయ్ సరంజామా వేరు.. ఇక కే లక్ష్మణ్ వర్గం, ఈటెల వర్గం .. ఇలా చెప్పుకుంటే పోతే పార్టీ పదవుల కంటే వర్గాలే ఎక్కువున్నాయంటున్నారు… ఇక్కడి బిజెపి నేతల తీరు కొందరిది రేవంత్ కు అనుకూలంగాను మరి కొందరిది బీఆర్ఎస్ కు దన్నుగా నిలిచే బాపతుగాను కనిపిస్తుంది…
బండి సంజయ్ ప్రభావం-
ప్రస్తుత కేంద్ర మంత్రి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా తన మార్క్ చూపించారు.. ఆయన పని చేసిన కాలమంతా బిజెపి మంచి ఊపు మీద కనిపించింది… ఎక్కడ చూసినా బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి అన్నట్లుగా నడిచింది.. స్తబ్దుగా ఉన్న బిజెపి క్యాడర్ నడుంకట్టి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంది.. గ్రేటర్ రిజల్ట్స్ తో పాటు… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి 40 నుంచి 50 సీట్లు ఖాయం అనే బజ్ క్రియేట్ చేసింది… అంతే మళ్లీ వర్గాలు బయలు దేరి పోయాయి.. బండి ఇలాగా అలాగా అంటూ హైకమాండ్ చెవిలో రాగాలు తీశాయి… అంతే బండిని తప్పించారు.. పార్టీ ఊపు… ఒక్కసారి చల్లారిపోయింది… అంతే అవకాశాన్ని రేవంత్ రెడ్డి అంది పుచ్చుకున్నారు.. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఈ ప్రస్తావన కూడా తెచ్చారు…
అసెంబ్లీలో 8 పార్లమంట్ లో 8 గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బిజెపి లోక్ సభ ఫలితాల్లో కేవలం మోడీ మ్యాజిక్ తో 8 ఎంపీ సీట్లు గెలుచుకొని సత్తా చాటింది.. అంటే దాదాపు 56 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి… కానీ ఆ పరిస్థితి ఇప్పుడు ఉందా అంటే నో ఆన్సర్ … బిజెపి అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక చేశారు.. బాగానే ఉంది.. అతనిపై భారం వదిలేసి ఎవరికి వారు యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.. కొత్త గా ఈ సెల్ఫ్ గ్రాఫ్ గేమ్ లోకి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎంటర్ అయ్యారు… జాతీయంగా చాలా అంశాలను బిజెపి టేకాఫ్ చేస్తోంది… కానీ వాటిని సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇక్కడ బిజెపి ఫెయిల్ అవుతోంది.. అలా అని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తప్పిదాలపై దూసుకుపోతోందా అంటే అదీ లేదు.. ఇలా మేం ఉన్నాం అన్నట్లుగా పార్టీ తీరు మారింది..
ఈటెలను ఊరించి ఉసురుమనిపించారు
సీనియర్ నేత ఈటెల రాజేందర్ ఇప్పుడు ఎంపీగా ఉన్నారు.. ఆయనకు అధ్యక్ష పదవి అనే టాక్ వచ్చింది.. అంతే మళ్లీ గ్రూపులు గుయ్యమని గూడు పుఠానీ రాజకీయాలు మొదలు పెట్టేశాయి… ఆయన వేరే పార్టీ నుంచి వచ్చారంటూ.. ఆయనకిస్తే మాకు కష్టం అంటూ రచ్చ చేశేశాయి.. అంతే ఈటెలకు పదవి రాకుండా చేశారు.. ఈటెలకు పదవి వచ్చి ఉంటే కొంత బీసీ వర్గాలనైనా ఆకర్షించడానికి స్కోప్ దొరికేది.. ఎప్పుడైతే పదవి దక్కలేదో .. ప్రాధాన్యత లభించలేదో ఆయన కూడా స్లో అయిపోయారు
కొరడా ఝలిపించాల్సిందే .. !
ప్రధాని మోదీ, అమిత్ షా, పార్టీ అధినాయకత్వం ఆలోచించాల్సింది ఒక్కటే.. సమయం మించిపోలేదు.. తెలంగాణపై దృష్టి పెట్టండి.. నేతలకు లక్ష్య్యాలు ఫిక్స్ చేయండి.. వచ్చే ఏడాది గ్రేటర్ ఎన్నికలు జరగబోతున్నాయి.. దాన్ని బలంగా ఉపయోగించుకొండి… పర్యటనలు పెంచండి… నేతల్లో ఎవరేంటో తెలుసుకొండి.. ఖచ్చితంగా ఫలితాలుంటాయి… బీఆర్ఎస్ కూడా వీక్ గా ఉంది.. కాంగ్రెస్ కు పోటీ ఇచ్చే స్థాయికి బిజెపిని తీసుకెళ్లడానికి ఇంతకు మించిన సమయం ఉండదు.. రంగంలోకి దిగండి.. రంకెలు పెట్టించండి.. ఇది సగటు బిజెపి అభిమాని విజ్ఞప్తి.

