కమాన్ విరాట్… కోట్టుకుపో.. రికార్డులు ఎత్తుకుపో..
విరాట్ కోహ్లీ వీర విహారం.. ఈ పదం పదే దే చూస్తున్నదే… అలాంటి విరాట్ కోహ్లీ పని అయిపోయిందని ఒకటే కూత… ఇప్పుడేమో మళ్లీ వచ్చి సెంచరీల మోత.. తాజాగా సౌత్ ఆఫ్రికాపై సెంచరీతో వన్డేల్లో విరాట్ సెంచరీల సంఖ్య 53కి చేరింది. ఇప్పటికే టెస్టుల్లో 30 శతకాలు బాదేసీన ఈ ఢిల్లీ డేరింగ్ మ్యాన్.. టీ 20లో ఒక సెంచరీ చేశాడు.. మొత్తం మూడు ఫార్మాట్లలలో 84 శతకాలు చిత్తకొట్టాడు.. దక్షిణాఫ్రికాపై రాయ్ పూర్ వన్డేలో కొట్టింది 7 వ శతకం… ఇంతటి విలువైన ఆటగాడిపై ఒకటే రాజకీయాలు.. ఒకటే వ్యక్తిగత వేధింపులు వెరసి ఆయన ఆడుతూనే ఉన్నాడు.. కోచ్ గంభీర్ బయటకు చప్పట్లు కొడుతున్నా.. లోలోపల మాత్రం రగిలిపోతూ ఉంటాడు.. కానీ… కానీ…
విరాట్, రోహిత్ శర్మల్లో చావ తగ్గలేదు.. వాళ్లిద్దరూ లేకుంటే ఈ రెండు మ్యాచ్ లు మన ఫెర్మార్సెన్స్ ఇక చెప్పక్కర్లేదు.. దేశ వ్యాప్తంగా గంభీర్ కోచ్ బాధ్యతలపై వరుస పరాభవాలపై చర్చ జరుగుతున్నా బీసీసీఐ పట్టించుకోదు.. మనవాడైతే చాలు ఫలితాలుతో సంబంధం లేదు పోస్టులో ఉంటే చాలు… మరో వైపు గంభీర్ , చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లు .. విరాట్ , రోహిత్ తో అంటి ముట్టినట్లు ఉంటున్నారు… గంభీర్, అగార్కర్లు ఒకప్పటి క్రికెటర్లే … ఆ విషయంలో గుర్తు తెచ్చుకుంటే చాలు.. మీరు ఎక్స్ ట్రాలు చేసినంత మాత్రాన.. విరాట్, రోహిత్ ల ఏకాగ్రతను భంగపరచలేరు… విరాట్ ఖచ్చితంగా నువ్వు సచిన్ 100 సెంచరీల రికార్డు కొడతావ్… నా నమ్మకమే కాదు.. కోట్లాది క్రికెట్ అభిమానుల నమ్మకం.. యస్ నువ్వు సాధిస్తావ్… గంభీర్ ఈ స్టోరీ నువ్వు చూస్తే బాగుండు..

