నా పేరు అనిరుధ్ రెడ్డి నాకు పబ్లిసిటీ కావలెను…
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి .. పవన్ పై వ్యాఖ్యలతో వార్తలోకెక్కారు.. ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించారు.. తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందనే అర్థం వచ్చేలా ఈ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి.. అయితే ఈ ఘటనపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముందు స్పందించారు.. పవన్ అభిమానిని అంటూనే.. నీ సినిమా ఆడనియ్య… అంటూ ఆంధ్రా వ్యాపారులు అన్న పదప్రయోగాన్ని వాడారు.. నేను గానీ మంత్రిని అయ్యానంటే మీ సంగతి చూస్తానంటూ పరోక్షంగా ఆంధ్రా సెటిలర్స్ ను హెచ్చరించారు..
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉండాలనుకుంటున్నారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారని, ఇరిగేషన్, రోడ్డు కాంట్రాక్టులు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే ఆంధ్ర ప్రజలను తెలంగాణలో తిరగనివ్వమని కూడా అప్పట్లో హెచ్చరించి విమర్శలపాలయ్యారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పీసీసీ కూడా ఆయనకు షోకాజ్ నోటీసులు జారీచేసేందుకు సిద్ధమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ చేరిక వార్తలపై కూడా నన్ను చంపేస్తారేమే అంటూ కామెంట్ చేశారు.. అనిరుధ్ రెడ్డి కి జిల్లా నాయకులు ముఖ్యంగా సీఎంతో అంతగా పొసగడం లేదనే టాక్ ఉంది… పార్టీలో కూడా అనుకున్నంతగా ప్రాధాన్యత దక్కడం లేదు.. దీంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ పై మాట్లాడి ఇమేజ్ పెంచుకోవాలనే పబ్లిసిటీ పిచ్చి పట్టుకుందంటున్నారు.. దానిపై మాట్లాడిన కొందరు కాంగ్రెస్ నేతలు కొంత చల్లారినా.. ఆయన మాత్రం ప్రతి రోజూ పవన్ పై వ్యాఖ్యలు చేస్తున్నారు.. నాకు పవన్ ఫ్యాన్స్ కి మధ్య పోటీ అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు.. మొత్తం మీద తెలంగాణ సెంటిమెంట్ కంటే పవన్ పై ఫోకస్ పెట్టి హైలెట్ అవ్వాలని అనుకుంటున్నారు.. పదే పదే ఆంధ్రా పెట్టుబడిదారులంటూ రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్ల తర్వాత కూడా మాట్లాడుతున్న అనిరుధ్ రెడ్డికి ఇప్పుడు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమనే సోయ ఉందా.. ఉంటే అలాంటి ఆంధ్రా పెట్టుబడిదారులను, చంద్రబాబు కోవర్టులను ఎంకరేజ్ చేస్తున్నవని మాట్లాడుతున్నావ్ గదా.. మరి సీఎం రేవంత్ రెడ్డిని నిలదీయలేకపోయావా.. ధైర్యం లేదా.. ?..

