కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.. గతంలో తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా.. సాయుధ పోరాట చరిత్రకు మద్దతుగా పలు సందర్బాల్లో మాట్లాడిన జనసేన అధినేత.. నోరు జారడం రచ్చై కూర్చోంది..
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు కావోస్తున్నా.. ఏదో ఒక సందర్బంలో నేతలు మాట్లాడుతూనే ఉన్నారు.. అటు ఏపీ నేతలైన..ఇటు తెలంగాణ నాయకులైనా.. అసందర్బ ప్రేలాపనలు చేసిన సందర్బాలున్నాయి… పవన్ కల్యాణ్ కూడా ఇలా మాట్లాడ్డం కరెక్టే కాదు.. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి .. రెండు రాష్ట్రాల్లో అత్యధిక అభిమాన గణం ఉన్న పవర్ స్టార్ గళం ఇలా మాట్లాడుతుందని ఎవరూ ఊహిస్తారు.. మరి దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి…
అయితే గతంలో మిగతా వారు మాట్లాడిన దానికి.. ఈ వ్యాఖ్యలుపై దుమారం పెద్దది కావడానికి ఒకే ఒక్క కారణం.. రెండు రాష్ట్రాల్లో టార్గెట్ పవన్ పాలిటిక్స్ జరుగుతుండటం… ఏపీలో కూటమి పదిహేనేళ్లు ఉంటుందని పవన్ బయటకు చెబుతున్నా.. ఈ మధ్య కాలంలో ఆయనకు గానీ.. జనసేన నేతలకు గానీ ఎదురవుతున్న అనుభవాల నేపథ్యంలో కాపు సామాజికవర్గం.. అతని అభిమాన వర్గం రగిలిపోతోంది… ఆఫీసుల్లో ఫోటో నుంచి.. ఏపీకి సంబంధించిన కీలక భేటీలకు సదస్సులకు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కు ప్రాధాన్యత లేకపోవడం.. చర్చనీయాంశమైంది… కందుకూరు ఘటన రేపిన చిచ్చు.. పవన్ – చంద్రబాబు ద్వయం చల్లార్చినా… అది రగిల్చిన నిప్పు రవ్వలు.. రాష్ట్రంలో అక్కడక్కడ రేగుతూనే ఉన్నాయి…
ఇక తెలంగాణలో తాజా ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ కు అస్త్రంగా మారాయి.. ఆయన తెలంగాణ ప్రస్తావన తేకపోయినా.. ఆ వ్యాఖ్యల్లో ఆ అర్థం స్పురిస్తోంది.. పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ అంటున్నారు.. బిజెపికి తెలుగు రాష్ట్రాల్లో కీలక రాజకీయ వనరు.. ఇంకేముంది కాంగ్రెస్ నేతలు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేస్తున్నారు.. ఒక టీవీ చర్చలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. పవన్ నైజం అది కాదు.. గద్దర్ ని, ఉద్యమాన్ని అర్థం చేసుకున్నవాడు.. కానీ ఇలా మాట్లాడ్డడం అనాలోచితం అన్నారు.. అయితే అతనిపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు పార్టీ స్టాండ్ కాదు.. అవి వారి వ్యక్తిగతమని వివరిణిచ్చారు.. పైపెచ్చు.. మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు జైకొట్టిన ఓటు బ్యాంకులో మెజార్టీ సెటిలర్ కాపు ఓట్లు ఉన్నమాట వాస్తవం కాదా.. అలా అని పవన్ కాపులకు ప్రతినిధి కాదు… కానీ ఆయన సామాజికవర్గం ఆయన్ను తమ భవిష్యత్తు అనుకుంటోంది… పవన్ ఇమేజ్ ను తగ్గించాలనుకునే ప్రతి సందర్బంలో ఆయన గ్రాఫ్ మరింత పెరుగుతుందని .. ఈ మధ్య కాలంలో ఆయన మరింత కీలకం అవ్వడంతో నచ్చని మెచ్చని సామాజికవర్గాలు, మీడియా టార్గెట్ చేస్తున్నాయని కాపు సామాజికవర్గం,. అభిమాన గణం బలంగా నమ్ముతున్నాయి… త్వరలో జరగబోయే గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పవన్ ను కొంచెం టార్గెట్ చేసిందంటున్నారు..
కొసమెరుపేంటంటే… పవన్ ని తిడుతున్న నేతలు .. ఇటు చిరంజీవి సూపర్ మ్యాన్ అని స్తుతించడం… అంటే బాగా రాజకీయ పాకంతో బెల్లం తయారు చేసే బాపతు మాట..

