మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పాదయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారు.. గతంలో 341 రోజులు 3648 రోజులు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన జగన్ … మళ్లీ పవర్ లోకి రావడానికి పాదయాత్రే పొలిటికల్ మాత్రగా భావిస్తున్నారు.. అయితే పాదయాత్ర ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో ఉంది.. 2027లో ప్రారంభిస్తారని అనుకుంటున్నారు.. అయితే నవంబర్ 9, 2027 నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభానికి రంగం సిద్దమైందంటున్నారు… పాదయాత్రకు ముందు కొన్ని నియోజవర్గాల పరిధిలో బస్సు యాత్రలు చేసి.. కొంత విరామం ఇచ్చి… ప్రజా సమస్యలపై ప్రతి నెలలో 7 జిల్లాలు కవర్ చేసేలా కార్యక్రమాలు, పర్యటనలు కొనసాగించి… చివరికి నవంబర్ 9, 2027 నుంచి పాదయాత్ర తో మళ్లీ జనంలోకి పోవాలని నిర్ణయించారంటున్నారు… అయితే ఈ సారి 400 రోజులు 4వేల కిలోమీటర్లు టార్గెట్ గా పెట్టుకున్నారని తెలుస్తోంది…
మరో వైపు కేంద్రం లో ఎన్డీఏ యూపీతో పలు రాష్ట్రాలకు ఒకే దఫా ఎన్నికలు నిర్వహించేందుకు వ్యూహా రచన చేస్తోందన్న గుస గుస వినిపిస్తోంది.. మిని జమిలి ఎన్నికల్లా దాదాపు 12 రాష్ట్రాల ఎన్నికలు ఒకే దఫా జరిపే ప్లాన్ ఉందంటున్నారు.. దీనిపై కూడా జగన్ తన కోర్ టీంతో చర్చించారట.. ఒక వేళ అదే జరిగితే.. 2026 జనవరి నుంచే పాదయాత్ర ప్రారంభించే ప్లాన్ బీ కూడా రెడీ అయ్యిందట.. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ గడువు 2027 మార్చి వరకు ఉంది.. ఆ సంవత్సరంలో మేలో యూపీతో పాటు ఏపీ మరో 10 రాష్ట్రాల ఎన్నికలు జరిపేందుకు కేంద్రం వ్యూహా రచన చేస్తోందంటున్నారు.. ఇప్పటికే దీనిపై ఎన్నికల కమిషనర్లలో ఒకరికి సాధ్యాసాధ్యాలు ప్రభావం పై నివేదిక సిద్దం చేయమని ఆదేశించినట్లు గా చెబుతున్నారు.. దీనిపై స్పష్టమైన సమాచారం ఉన్న వైసీపీ అధినేత దానికి తగ్గట్లుగానే పాదయాత్రపై ప్లాన్ బీ కూడా సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది…
గతంలో మీ కోసం పాదయాత్రతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు… ప్రజా సంకల్ప పాదయాత్ర తో జగన్మోహాన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.. అంతకు ముందు రాజశేఖర్ రెడ్డి పవర్ లోకి రావడానికి పాదయాత్రే ప్రామాణికం అయ్యింది… మరి జగన్ చేపట్టబోయే ఈ రెండో పాదయాత్ర వైసీపీని అధికారానికి దగ్గర చేస్తుందో లేదో చూడాలి…

