ఐ బొమ్మ రవికి సవాల్ విసిరి మరి పట్టుకొని.. మూలాలను చెండాడుతున్న హైదరాబాద్ కమిషనర్ విశ్వనాథ చెన్నప్పసజ్జనార్ కృషిని కాదనలేం… నిజంగా పైరసీ భూతాన్ని అరికట్టేక్రమంలో ఇది బిగ్ అచీవ్ మెంట్… ఐ బొమ్మ రవిని అదుపులోకి తీసుకున్న తర్వాత చిరంజీవి, రాజమౌళి, నాగార్జున, సురేష్ బాబు .. సజ్జనార్ ను కలిసి థ్యాంక్స్ చెప్పారు.. పనిలో పనిగా ఐ బొమ్మ రవిపైన,. పైరసీపై మాట్లాడేశారు… అంత బాగానే ఉంది… ఈ ప్రెస్ మీట్ లో నటుడు నాగార్జున ఉండటం… న్యూస్ పాయింట్ అయ్యింది… నాగార్జున ఏదో పతీతు లాగా… మాట్లాడుతున్నాడు… కమిషనర్ ఆయన్ని పక్కన పెట్టుకోని ప్రెస్ మీట్ పెట్టడం ఏంటనీ కొంత మీడియా కోడై కూసింది..
అయితే ప్రముఖ హేతువాదీ బాబు గోగినేని సజ్జనార్ కు ఒక ప్రశ్న సంధించారు.. ఐ బొమ్మ రవి తప్పు చేశాడు నో డౌట్… మరి చెరువును ఆక్రమించుకొని అక్రమ కట్టడం కట్టి సంవత్సరాలుగా అప్పనంగా కోట్లు పోగేసిన నాగార్జునను ఏమీ చేయాలనేది ఆయన ప్రశ్న… అయితే రేవంత్ సీఎం అయిన తర్వాత హైడ్రా .. నాగార్జున ఆక్రమిత ఎన్- కన్వెన్షన్ ను కూల్చేసింది… అయినా ఇన్ని రోజులు నాగార్జున అప్పనంగా సంపాదించిన మొత్తాన్ని ఏమైనా కక్కించగలిగారా.. అది ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమే కదా… అందులోనూ ఆక్రమించినందుకు ఏమైనా ఆశ్చర్యపడే క్రిమినల్ చర్యలు తీసుకున్నారా అది లేదు… కదా… అలాంటప్పుడు బాబు గోగినేని ప్రశ్నలో సహేతుకత కనిపిస్తోంది… అలా అని సజ్జనార్ నిబద్దతను ప్రశ్నించకూడదు.. నాగార్జున కూడా ఐ బొమ్మ రవి వ్యవహారంలో పెద్ద నిజాయితీపరుడిలా మాట్లాడకూడదు… ప్రభుత్వాల సహాకారం నాగార్జున లాంటి వారికి వరం అదంతే…

