సీనియర్ పొలిటిషియన్ కావూరి సాంబశివరావు మృతి చెందారు.. రెండు రోజుల క్రితమే మరణించినా… విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యుల రాకతో పాటు మంచి రోజు, నక్షత్రం చూసుకొని ప్రకటన చేద్దామని కుటుంబ సభ్యులు భావించారని టాక్.. అయితే దాని ప్రకటన రాకముందే పత్రికల్లో ఇక సెలవు అంటూ ఫస్ట్ పేజీ ప్రకటన వేయించారు.. అంటే అధికారికంగా మరణించినట్లు ప్రకటించారు… ఇంత వరకు బాగానే ఉంది.. కాని… ఫస్ట్ పేజీలో యాడ్ అయితే ఇచ్చారు కాని.. తెలంగాణ పత్రికలైన నమస్తే తెలంగాణ, వెలుగు, నవతెలంగాణ మిగతా పత్రికలకు యాడ్ ఇవ్వకపోవడం కొత్త చర్చకు దారి తీసింది… దీంతో పాటు ఎనభైళ్ల వయసు సంతృప్తినిచ్చిందని లేఖ రాసిన కావూరి .. బకాయిలు చెల్లింపుపై బ్యాంకు అధికారుల రాసిన లేఖలకు మాత్రం స్పందించలేదు.. ఆయన ఆఫీసుల ముందు బ్యాంకు అధికారులు బ్యానర్లు కట్టి… ఆందోళన చేపట్టినా స్పందించలేదు… ఇదేనా సంతృప్తికరమైన జీవితం… అంటూ మీడియాలో చెవులు కొరుక్కుంటున్నారు.. ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ తో పాటు వేరే కంపెనీల పేరుతో కావూరి బ్యాంకులకు 9 వేల కోట్ల బకాయిలున్నట్లు చెబుతున్నారు..

Posted inAndhra Pradesh Telangana
