చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. సీఎం పవనే.. కాపుల్లో ఒకటే చర్చ…
బీహార్ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.. బీహార్ సీఎం నితీష్ రాజ్యసభకు వెళ్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో.. మళ్లీ చంద్రబాబు డిప్యూటీ ప్రధాని లేక కేంద్ర మంత్రి అలాగే లోకేశ్ ఇక్కడ సీఎం అనే చర్చ మొదలైంది… గతంలో కూడా చంద్రబాబు ఉప రాష్ట్రపతి అవుతారని ఒక వర్గం మీడియా ఊదరగొట్టేసింది.. ఆ తర్వాత ఆ చర్చ ఆగిపోయింది.. అయితే ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ మోదీ వారసుడు చంద్రబాబు.. అన్నీ కుదిరితే లోకేష్ కూడా అంటూ ప్రచురించిన కథనం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఆ తర్వాత ఆ చర్చ అక్కడికి ఆగిపోయింది.. కానీ సడన్ గా బీహార్ సీఎం నితీష్ నిర్ణయంతో లోకేశ్ సిఎం ప్రస్తావన మళ్లీ చర్చకు వచ్చింది.. వచ్చే సంవత్సరం ఏపీలో కొన్ని రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.. అప్పుడు చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వం తీసుకొని డిప్యూటీ ప్రధానిగానో లేక కేంద్ర మంత్రిగానే వెళ్తారని ఇక్కడ లోకేష్ ను సీఎం చేస్తారని టీడీపీలోనూ.. టీడీపీ అనుకూల మీడియా ఛానళ్లలో ఒక్కటే చర్చ మొదలైంది.. రాహుల్ ను ప్రధాని చేయడంలో సోనియా గాంధీ, కేటీఆర్ ను సీఎం చేయడంలో కేసీఆర్ అవకాశం ఉన్నా తప్పు చేశారని… అలాంటి చంద్రబాబు చేయకూడదని గతంలో కొన్ని విశ్లేషణలు వచ్చాయి.. పేరుకే చంద్రబాబు సీఎం అయినా.. ఇప్పుడు 70 శాతం పైగా వ్యవహారాలు లోకేషే చక్కబెడుతున్నారని పార్టీ వర్గాల్లోనూ పాలనా వర్గాల్లో చర్చ జరుగుతోంది.. లోకేష్ ను ఈ ప్రభుత్వంలోనే సీఎం చేస్తే.. ఏపీ రాజకీయాల్లో నిలదొక్కుకుపోతారనేది టీడీపీలో ఓ వర్గం ఆశ.. అంచనా… ఇదంతా బాగుంది కానీ ఏపీలో ఉన్నది బిజెపి, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం .. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు.. అందులోనూ కూటమి అధికారంలో రావడానికి పవన్ కీలకంగా వ్యవహరించారు.. టీడీపీకి బలమవ్వడమే కాకుండా బిజెపి – టీడీపీ మధ్య పటిష్ట బంధం ఏర్పడడానికి కారణమయ్యారు.. అయితే పవన్ పట్ల సీఎం చంద్రబాబు, లోకేష్ కూడా అదే గౌరవాన్ని, ప్రాధాన్యతను ఇస్తున్నారు.. కానీ ఒక వేళ లోకేష్ సీఎం అయితే పవన్ డిప్యూటీ సీఎం గా ఎలా ఉంటారనే చర్చ మరో వైపు మొదలైంది.. ముఖ్యంగా గత మూడు రోజులుగా కాపు సర్కిల్స్ లో ఇదే చర్చ జరుగుతోంది.. అటు వైసీపీలో కాపు వర్గం కూడా ఈ చర్చ ఎక్కువుగా జరిగితే… కూటమిలో కొంత కుదుపు రావోచ్చనే రాజకీయ అంచనా వేస్తోంది.. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే పవన్ ను సీఎం చేసి.. డిప్యూటీ సీఎంగా లోకేష్ ఉండాలని.. అలా కాని పక్షంలో ఇక పవన్ భవిష్యతంతా నెంబర్ 2గానే ఉండిపోవాలని కాపులు మాట్లాడుకుంటున్నారు… ఇప్పుడు పవన్ను సీఎం చేసి.. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే లోకేష్ ను సీఎం చేసే ప్రతిపాదన చేసినా ఓకే అన్న మరో డిస్కషన్ ఒక వైపు జరుగుతోంది.. అయితే చంద్రబాబు నేతృత్వంలో ఎన్నికలు వెళ్తేనే బెటరని .. లేకపోతే జగన్ను ఎదుర్కోవడం లోకేష్, పవన్ తో అయ్యే పని కాదని టీడీపీలో మరో వర్గం అనుకుంటోంది… అయితే లోకేష్ ను అధికారంలో ఉన్నప్పుడే సీఎం చేయాలనేదే టీడీపీలో కొందరి కల.. ఆయన కుటుంబంలోనూ ఆ ఆకాంక్ష ఉండటం తప్పు కాదు.. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు ఇక భవిష్యత్తు లోకేషేననేది నిర్విదాదంశం.. అయితే లోకేష్ భవిష్యత్తులో తనకు తానుతో పాటు టీడీపీ పార్టీని ఎంతవరకు నిలబెట్టుకుంటారనేదే ఆయనపై ఆధారపడి ఉంది.. ఈ నేపథ్యంలో పవన్ను కాదని లోకేష్ ను సీఎం చేస్తే ఎలా ఉంటుంది.. ఒక వేళ పవన్ ఒప్పుకున్నా.. జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గం ఎలా రెస్పాండ్ అవుతుంది… ఈ పరిణామం చోటు చేసుకుంటే వైసీపీ దీన్ని రాజకీయం ఎలా వాడుకుంటుదనేది ఇంట్రెస్టింగే.. అయితే అందరూ అనుకున్నట్లు అన్ని జరగవు కదా.. అసలు చంద్రబాబు ఆ ఆలోచనలో ఉన్నారా.. ఒక వేళ ఉంటే నాన్ బిజెపి వ్యక్తికి డిప్యూటీ ప్రధాని ఇచ్చే ఆలోచన బిజెపికి ఉందా.. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండటానికి కీలకంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని గందరగోళ పరిచే చర్యకు బిజెపి ఉపక్రమిస్తుందా లేదా చూడాలి.. అంతకు మించి నిప్పు లేకుండా ఈ పొగ సృష్టిస్తున్నారనేదే కూడా వాస్తవమనే ఒప్పుకోవాలి… వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం.. రాజకీయం అంత సాఫీగా సాగదనేది స్పష్టం…

Posted inAndhra Pradesh ap politics pawankalyan telugumedia
